లక్నో: హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసినట్టు గురువారం పోలీసులు తెలిపారు. రామ్ లడైట్, ఉపేంద్ర సింగ్ యాదవ్, మేఘ్ సింగ్, ముకేశ్ కుమార్, మంజు యాదవ్, మంజు దేవీలను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. 121 మంది మరణానికి కారణమైన సత్సంగ్ను వీరే నిర్వహించారని, కార్యక్రమానికి వీరే అనుమతి పొందారని పోలీసులు చెప్పారు.
సూరజ్ పాల్ అలియాస్ భోలే బాబా ఆచూకీ మాత్రం తెలియడం లేదని తెలుస్తున్నది. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు భోలే బాబా ఆశ్రమానికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. ఎఫ్ఐఆర్లో భోలే బాబా పేరు లేనందున ఆయనను అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిని విచారించిన తర్వాత అవసరమైన భోలే బాబాను విచారిస్తామని తెలిపారు.