వైద్యుల వస్త్రధారణపై హర్యానా ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే వైద్యులకు, సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు చేసింది.
ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జీన్స్, పొట్టి క్రాప్ టాప్స్, స్కర్ట్స్, స్నీకర్స్ ధరించకుండా నిషేధం విధించింది. ఈ కొత్త రూల్‌కు సంబంధించి హర్యానా వైద్యశాఖ మంత్రి అనిల్ వీజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నిర్ణయం దవాఖానలో ఏకరూపతను తీసుకురావడానికి అని.. అలాగే రోగులు, వైద్య సిబ్బందిని గుర్తించడంలో సహాయపడుతుందని మంత్రి తెలిపారు.
కాగా.. సిబ్బందికి కొత్త యూనిఫామ్‌లను డిజైనర్లు డిజైన్ చేస్తున్నారని మంత్రి వెల్లడించారు.