భివాని (హర్యానా): హర్యానాలోని భివాని జిల్లాలో కొండచరియ విరిగిపడటంతో నలుగురు మరణించారు. శిథిలాల కింద మరో ఐదుగురు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఎక్కువ మందే చిక్కుకుపోయి ఉండొచ్చని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటన శనివారం దాదమ్ మైనింగ్ జోన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అధికారులు మాట్లాడు తూ శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సహాయ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. దాదాపు ఐదారు ట్రక్కులు, యంత్రాలు కూడా శిథిలాల కింద కూరుకుపోయాయన్నారు.