న్యూఢిల్లీ: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్కు ఎప్స్టీన్ ఉచ్చు చిక్కుకుంటున్నది! లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్తో ఆయన ఒకటి కాదు చాలా సార్లు ఈ-మెయిల్ ద్వారా సంభాషించినట్టు రుజువులు బయటకు రావడమే అందుకు కారణం. యూఎస్ న్యాయ శాఖ వెబ్సైట్లో మంత్రి పేరును హర్దీప్ పురి గా 46 సార్లు, హర్దీప్గా 430 సార్లు, హర్దీప్ సింగ్ పురిగా 163 సార్లు ప్రస్తావించారు.
‘ఒక మహిళా ఎంపీ ఉన్నారు. ఆమె నన్ను పక్కకు తీసుకెళ్లారు. వీళ్లలో చాలా మంది అసూయపరులున్నారని ఆమె నాతో అన్నారు. ఏమైనా జరిగితే నేను మాట్లాడతాలే అని నేను ఆమెతో అన్నాను. అయితే నేను దీంతో ఇరుక్కుపోయా’ అని తీవ్రమైన సమస్యను హర్దీప్ జోక్ చేశారని, అసూయ పడేవారి గురించి సాధారణంగా వ్యాఖ్యానించారని ఆ మెయిళ్లలో ఉన్నట్టు సమాచారం! తాను మోదీ ప్రభుత్వంలో చేరకముందు ఎప్స్టీన్తో సంభాషించానన్న హర్దీప్ వాదన కూడా అబద్ధమని తేలిపోయింది. ఆయన మోదీ మంత్రివర్గంలో చేరిన తర్వాత ఎప్స్టీన్కు పంపిన మెయిల్స్ తేదీలతో సహా బయటకు వచ్చాయి.
తన సహాయకురాలు ఇండియాలో జరిగే ఒక పెండ్లికి హాజరయ్యేందుకు వీసా ఇప్పించాలని ఎప్స్టీన్ కోరగా హర్దీప్ అందుకు సహకరించారు. చాలావరకు ఆయన తన ఐఫోన్ ద్వారానే ఎప్స్టీన్కు మెయిల్స్ పంపారు. ఎప్స్టీన్కు ‘ప్రజల పట్ల అభిరుచి ఉండటాన్ని’ హర్దీప్ ఒక మెయిల్లో ప్రశంసించారు. అది ఎందుకు ఉద్దేశించిందో మాత్రం తెలియలేదు. ఇంకో మెయిల్లో వేరే దేశంలోని ద్వీపానికి ఎప్స్టీన్ విహార యాత్రకు వెళ్లి వచ్చాక ‘అక్కడ మీరు బాగా ఆనందించి ఉంటారు’ అని హర్దీప్ పేర్కొన్న విషయం కూడా తాజాగా బయటకు వచ్చింది.