తిరువనంతపురం: మలయాళం సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. ఇండస్ట్రీలో మహిళా ప్రొఫెషనల్స్ లైంగిక వేధింపులు, దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నది. అమానవీయ ప్రవర్తనకు బాధితులుగా ఉన్నారని తెలిపింది.
ఇండస్ట్రీని కొంత మందితో కూడిన ఒక ‘క్రిమినల్ గ్యాంగ్’ నియంత్రిస్తున్నదని పేర్కొన్న కమిటీ.. లొంగని మహిళలను ఇండస్ట్రీ నుంచి బయటకు పంపేస్తారని వెల్లడించింది. కొంత మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటులు, ప్రొడక్షన్ కంట్రోలర్స్ మధ్య ఒప్పందం ఉన్నదని కమిటీ నివేదిక ఆరోపించింది. 2017లో ఓ నటిపై దాడి కేసు తర్వాత ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.