Haryana Murder: 5 సెకన్లలో 10 రౌండ్ల కాల్పులు.. హర్యానాలో జిమ్ ఆపరేటర్ హత్య.. వీడియో
Haryana Murder: హర్యానాలో జిమ్ ఆపరేటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. 5 సెకన్లలో అతనిపై 10 రౌండ్ల ఫైరింగ్ జరిపారు. కస్టమర్లకు శిక్షణ ఇస్తున్న ఆ జిమ్ ఆపరేటర్ అక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనకు చెందిన సీసీటీవీ ఫూటేజ్ వైరల్ అవుతోంది.
చండీఘడ్: హర్యానాలో దారుణ మర్డర్(Haryana Murder) జరిగింది. ఓ జిమ్ ఆపరేటర్‌ను సమీపం నుంచి కాల్చి చంపారు. ఈ ఘటన గురువారం ఉదయం హన్సి పట్టణంలో జరిగింది. మృతుడిని కపిల్‌గా గుర్తించారు. అతని వయసు 27 ఏళ్లు. జిమ్ కస్టమర్లకు శిక్షణ ఇస్తున్న సమయంలో అతను జిమ్ బయటే ఉన్నాడు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు మోటర్ బైక్‌పై వచ్చి సమీపం నుంచి అతన్ని కాల్చేశారు. కేవలం 5 సెకన్లలోనే 10 రౌండ్ల ఫైరింగ్ చేసినట్లు తెలుస్తోంది. కపిల్‌ను ఆస్పత్రికి తరలించినా.. అతని ప్రాణాలు దక్కలేదు.
ఈ ఘటన జరిగిన సమయంలో ఆ జిమ్ సమీపం వద్ద ఉన్న ఓ మహిళ గాయపడింది. ఆమెను హిసార్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఏ కారణం చేత జిమ్ శిక్షకుడిపై దుండగులు కాల్పులు జరిపారో ఇంకా పోలీసులు వెల్లడించలేదు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా పోలీసులు ఆ దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. జింద్ జిల్లాలోని దాలంవాలా గ్రామం బాధితుడి స్వస్థలం. హన్సీ పట్టణంలోని శాంతి నగర్లో అతను ప్రస్తుతం నివాసం ఉంటున్నాడు.
జిమ్ ఆపరేటర్ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
In a shocking incident, a 25-year-old gym owner was shot dead by unidentified assailants in Haryana’s Hansi on Thursday morning in a brutal attack.
The victim, identified as Kapil, was outside his gym working out with a group of people when the bike-borne assailants opened fire… pic.twitter.com/w6WxINe3bu
— Hate Detector 🔍 (@HateDetectors) June 11, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

