Election commissioners | ఎలక్షన్ కమిషనర్లగా జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధు ఎంపిక
Election commissioners | బ్యూరోక్రాట్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధును ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేశారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
న్యూఢిల్లీ: బ్యూరోక్రాట్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధును ఎన్నికల కమిషనర్లుగా (Election commissioners) ఎంపిక చేశారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధు 1988 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు. పంజాబ్‌కు చెందిన సంధు ఉత్తరాఖండ్ ఐఏఎస్ కేడర్‌కు చెందినవారు. జ్ఞానేష్ కుమార్ కేరళ కేడర్‌కు చెందినవారు. సంధు గతంలో ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌తో సహా పలు కీలక ప్రభుత్వ పదవులు చేపట్టారు. జ్ఞానేష్ కుమార్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతోపాటు అమిత్ షా నేతృత్వంలోని సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు.
కాగా, ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి సెలక్షన్ బోర్డు గురువారం ఉదయం సమావేశమైంది. కమిటీ సభ్యులలో ఒకరైన అధిర్ రంజన్ చౌదరి ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. బుధవారం రాత్రి పరిశీలన కోసం తనకు 212 పేర్లు ఇచ్చారని ఆయన తెలిపారు. సమావేశానికి ముందు ఆరుగురితో కూడిన షార్ట్‌లిస్ట్ పేర్లను తనకు ఇచ్చారని చెప్పారు. ‘మెజారిటీ వారికి ఉంది. కాబట్టి వారు తమకు కావలసిన అభ్యర్థులను ఎంచుకున్నారు’ అని వ్యాఖ్యానించారు. అలాగే ఎంపిక విధానాన్ని తాను ప్రశ్నించానని, దీనిపై అసంతృప్తి లేఖ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

