గురుగ్రామ్, ఏప్రిల్ 25: కాబోయే భార్య ఇంటికి వస్తుందని తెలిసి లైంగిక సామర్థ్యాన్ని పెంచే డ్రగ్స్ తీసుకుని గురుగ్రామ్‌లో ఒక యువకుడు మరణించాడు! నాగ్‌పూర్‌కు చెందిన 29 ఏండ్ల రోహిత్ లాల్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో పనిచేస్తూ గురుగ్రామ్‌లోని సెక్టార్ 53లో ఉన్న పీజీ ఫ్లాట్‌లో ఉండేవాడు.
లాల్ తనకు కాబోయే భార్యను శనివారం రూమ్‌కు ఆహ్వానించాడు. కాగా, ఘటన జరిగిన రోడు లాల్ ఫోన్ ఎత్తలేదని, రూమ్ డోర్ కూడా తీయలేదని అతని స్నేహితుడు తెలిపాడు. దీంతో వచ్చి ఫ్లాట్‌లో పరిశీలించగా లైంగిక సామర్ధ్యాన్ని పెంచే ఉత్ప్రేరక మందులు, సప్లిమెంట్లు కన్పించాయి. వాటి ఓవర్ డోస్ వల్ల గుండెపోటుతో లాల్ మరణించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.