న్యూఢిల్లీ : అత్యాచారం, హత్య కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్కు మరోసారి పెరోల్ మంజూరైంది. ఆయన దోషి అని 2017లో తీర్పు వెలువడిన తర్వాత ఆయనకు హర్యానా ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కల్పించడం ఇది 13వ సారి.
ఈసారి ఆయన జైలు బయట 21 రోజులపాటు గడపవచ్చు. ఇద్దరిపై అత్యాచారం చేసినట్లు రుజువు కావడంతో ఆయనకు 20 సంవత్సరాల జైలు శిక్ష, మరో రెండు హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నికలకు ముందు ఆయనకు పెరోల్ లభిస్తుండటంపై విమర్శలు వచ్చాయి.