అహ్మాదాబాద్: గుజరాతీ జానపద గాయని ఊర్వశి రాధాదియాపై కనకవర్షం కురిసింది. స్టేజ్‌పై ఆమె పాటు పాడుతుండగా.. ఓ వ్యక్తి బకెట్లో నగదుతో వచ్చి ఆమెపై కురిపించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. కరెన్సీ నోట్లు తనపై కురుస్తుంటే ఆమె గుజరాతీ జానపద గానంతో ఆహుతుల్ని ఆకట్టుకున్నది. స్టేజ్‌పై కూర్చుని ఊర్వశి తన హార్మోనియం వాయిస్తూ పాట పడింది. ఆ సమయంలో కొందరు వ్యక్తులు 500 నోట్లను ఆమెపై కురిపించారు. శ్రీ సమస్త్ హిరాద్వానీ గ్రూపు నిర్వహించిన తులసీ వివాహ సెర్మనీలో ఈ ఘటన జరిగింది. వెలకట్టేలని ప్రేమను పంచారంటూ ఊర్వశి తన వీడియోకు కామెంట్ పెట్టింది. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. ఊర్వశికి రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. క్వీన్ ఆఫ్ గుజరాతీ ఫోక్గా ఆమెను పిలుస్తారు.