పెట్టుబడి సూచీలో గుజరాత్ టాప్
నీతి ఆయోగ్ రూపొందించిన మొట్టమొదటి పెట్టుబడి స్నేహపూర్వక సూచీ(ఐఎఫ్ఐ)- 2026లో దేశంలోనే అత్యంత పెట్టుబడి-అనుకూల రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది.
- నీతి ఆయోగ్ తొలి ఐఎఫ్ఐ విడుదల
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ రూపొందించిన మొట్టమొదటి పెట్టుబడి స్నేహపూర్వక సూచీ(ఐఎఫ్ఐ)- 2026లో దేశంలోనే అత్యంత పెట్టుబడి-అనుకూల రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. ఒకరి ఉత్తమ విధానాల నుండి మరొకరు నేర్చుకుంటూనే ప్రైవేట్ పెట్టుబడుల కోసం పోటీపడేలా ఈ సూచీ ర్యాంకింగ్‌లు రాష్ర్టాలను ప్రోత్సహిస్తాయని నీతి ఆయోగ్ ఆశిస్తున్నది. శుక్రవారం విడుదలైన ఐఎఫ్ఐ నివేదిక పెట్టుబడులను ఆకర్షించి, వాటిని నిలబెట్టుకునే సామర్థ్యంపై 28 రాష్ర్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలను అంచనా వేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసేటపుడు 1,850 మందికి పైగా పెట్టుబడిదారులను సర్వే చేయడంతోపాటు 165 మంది వాటాదారుల నుండి వచ్చిన సూచనలను కూడా పొందుపరిచారు. ఈ నివేదిక రాష్ర్టాలను అగ్రశ్రేణి రాష్ర్టాలు, ముందంజలో ఉన్న రాష్ర్టాలు, వర్ధమాన రాష్ర్టాలు, ఆకాంక్ష గల రాష్ర్టాలుగా వర్గీకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

