అహ్మదాబాద్ : కరోనా టీకా తీసుకున్నప్పటికీ ఓ మంత్రికి కొవిడ్ టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గుజరాత్‌కు చెందిన మంత్రి ఈశ్వర్‌సిన్హ్ పటేల్ కొద్ది రోజుల క్రితం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మంత్రి తన ట్విటర్ పేజీలో వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
આજરોજ મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદથી હાલમાં મારી તબિયત સારી છે.
— Ishwarsinh T Patel (@patelishwarsinh) March 15, 2021
છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને સાવચેતીના ભાગરૂપે તેમનો કોરોના ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરૂ છું.