న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రత్యక్ష పన్నుల రూపేణా స్థూలంగా రూ.13,63,649 కోట్లు వసూలయ్యాయి. ఏడాది క్రితం నాటి వసూళ్ల కంటే ఇవి 26 శాతం అధికం. టీడీఎస్ డిడక్షన్లు, కార్పొరేట్ అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు ఆరోగ్యకరంగా ఉండటమే ప్రత్యక్ష పన్ను వసూళ్ల వృద్ధికి కారణమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రిఫండ్ల సర్దుబాటు తర్వాత ఇప్పటి వరకు నికరంగా రూ.11.35 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరిగాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి బడ్జెట్లో నిర్దేశించుకున్న ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం (రూ.14.20 లక్షల కోట్ల)లో ఇవి దాదాపు 80 శాతానికి సమానమని పేర్కొన్నది. కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయ పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు.