లక్నో: పెళ్లి తంతు చివర్లో ట్విస్ట్ జరిగింది. వధువు ప్రియుడు వరుడికి ఫోన్ చేశాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు పంపాడు. వీటిని చూసిన పెళ్లికొడుకు ఆ పెళ్లిని రద్దు చేసుకున్నాడు. (Groom Calls Off Wedding) ఈ నేపథ్యంలో పెళ్లికుమార్తె ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పెళ్లికూతురు కుటుంబం, ఆమె బంధువులు ఊరేగింపుగా ఆడమ్పూర్కు చేరుకున్నాడు. వారంతా పెళ్లి భోజనాలు చేశారు.
కాగా, మరికొన్ని నిమిషాల్లో పెళ్లి తంతు పూర్తికానున్నది. ఇంతలో వరుడికి కమల్ సింగ్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. పెళ్లికుమార్తె, తాను ప్రేమించుకున్నట్లు చెప్పాడు. ఆమెను పెళ్లి చేసుకోవద్దని హెచ్చరించాడు. వరుడు ఆధారాలు అడగ్గా వధువుతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, హోటల్లో గడిపిన వీడియో క్లిప్స్‌ను పంపాడు. వీటిని చూసి ఆ మహిళతో పెళ్లిని వరుడు రద్దు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వధువు కుటుంబం, బంధువులు తిరిగి వెళ్లిపోయారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కమల్ సింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.