న్యూఢిల్లీ: భారత్‌ను అల్లకల్లోలం చేస్తున్న కరోనా సెకండ్ వేవ్‌పై స్వీడ్న్కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బెర్గ్ స్పందించారు. దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటం, ఆక్సిజన్, ఔషధాల కొరతపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లోని కరోనా సంక్షోభం నేపథ్యంలో జరుగుతున్న సంఘటనలు హృదయ విదారకరమని అన్నారు. ఈ సంక్షోభం నుంచి భారత్ బయటపడేందుకు ప్రపంచ సమాజం వెంటనే అవసరమైన సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆమె ట్వీట్ చేశారు.
Heartbreaking to follow the recent developments in India. The global community must step up and immediately offer the assistance needed. #CovidIndia https://t.co/OaJVTNXa6R
— Greta Thunberg (@GretaThunberg) April 24, 2021
దేశంలో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 3.46 లక్షల రోజువారీ కరోనా కేసులు, 2,624 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.66 కోట్లకు, మొత్తం మరణాల సంఖ్య 1.89 లక్షలకు పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా వంటి పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కరోనాపై పోరులో అండగా ఉంటామని ముందుకు వస్తున్నాయి. ప్రధానంగా ఆక్సిజన్ సరఫరాకు సహకరిస్తున్నాయి.