న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: కొవిడ్ నుంచి రక్షణ కల్పించేందుకు హైదరాబాదీ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన నాసల్ వ్యాక్సిన్ (ముక్కు ద్వారా తీసుకొనే టీకా) ఇన్కోవాక్కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. చింపాంజీ అడినో వైరస్ వెక్టార్కు కొన్ని మార్పులు చేసి రూపొందించిన ఈ వ్యాక్సిన్ (బీబీవీ 154)ను అత్యవసర పరిస్థితుల్లో 18 ఏండ్లు పైబడినవారికి ఉపయోగించేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం వెల్లడించారు. ఈ టీకా పనితీరును అంచనా వేసేందుకు భారత్ బయోటెక్ 4 వేల మంది వలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. వారెవరిలోనూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని కంపెనీ వర్గాలు వివరించాయి.