గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 12, 2020 , 19:15:32

కంపెనీ బోర్డు సమావేశంలో కాల్పులు

కంపెనీ బోర్డు సమావేశంలో కాల్పులు

ఢిల్లీ: నోయిడాలో ఓ కంపెనీ బోర్డు సమావేశంలో ఘాతుకం జరిగింది. యూపీ టెలీలింక్స్ అనే కంపెనీ డైరెక్టర్ల సమావేశంలో సీనియర్ డైరెక్టర్ ప్రదీప్ అగర్వాల్ ఇద్దరు డైరెక్టర్లపై తుపాకీతో కాల్పులు జరిపి, తానూ కాల్చుకున్నాడు. అగర్వాల్‌తో పాటుగా నరేశ్ గుప్తా అనే డైరెక్టర్ అక్కడికక్కడే మరణించారు. మరో డైరెక్టర్‌ జైన్‌ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చే్స్తున్నారు.  ముగ్గురు డైరెక్టర్ల మధ్య వ్యాపార గొడవలతో ఈ ఘటన చోటు చేసుకుందని అనుమానిస్తున్నట్లు సెంట్రల్‌ నోయిడా డిప్యూటీ కమిషనర్‌ హరీశ్‌ చందర్‌ తెలిపారు. 


logo