Guinness Record | న్యూఢిల్లీ, ఆగస్టు 15: జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామీ విజేత రిక్కీ కేజ్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ గీతాలాపన గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. యూకేకు చెందిన 100 మందితో కూడిన రాయల్ ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రా, మన దేశానికి చెందిన హరిప్రసాద్ చౌరాసియా, రాకేశ్ చౌరాసియా, రాహుల్ శర్మ, అమాన్, అయాన్ అలీ బంగాశ్, రాహుల్ శర్మ, జయంతి కుమరేశ్, షేక్, కలీషాబి మహబూబ్, గిరిధర్ ఉడుప వంటి సంగీతవేత్తలు కలిసి జాతీయ గీతానికి సంగీతాన్ని ఇచ్చారు.
కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన 14 వేల మంది ఆదివాసీ చిన్నారులు భారతదేశ చిత్రపటం, భారత్ అనే అక్షరక్రమంలో నిల్చొని జాతీయ గీతాలాపన చేశారు. ఈ వీడియోను రిక్కీ కేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.