ముంబై, ఏప్రిల్ 21 : దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో తెలిపే గణాంకాల్ని ఇకపై నెలవారీగా విడుదల చేయబోతున్నట్టు కేంద్రం వెల్లడించింది. కొత్త విధానం మే 15 నుంచి మొదలవుతుందని, ప్రతి నెలా నిరుద్యోగిత డాటాను విడుదల చేస్తామని కేంద్ర గణాంకాల శాఖ ఉన్నతాధికారి ఒకరు సోమవారం మీడియాకు తెలిపారు. మే 15న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే డాటాలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల నిరుద్యోగిత గణాంకాలు ఉంటాయని చెప్పారు. కేంద్రం ఇప్పటివరకు.. త్రైమాసిక ప్రాతిపదికన పట్టణ నిరుద్యోగిత, వార్షిక ప్రాతిపదికన గ్రామీణ, పట్టణ నిరుద్యోగిత డాటాను కలిపి ఇస్తున్నది. నెలవారీగా డాటాను విడుదల చేయటం ఇదే మొదటిసారి.