న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీని కాలుష్యం వేధిస్తున్న తరుణంలో వ్యవసాయ పంటల వ్యర్థాలను బహిరంగంగా తగులబెట్టడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ నేరానికి పాల్పడేవారికి భారీ జరిమానాలను విధించేందుకు పారిశుద్ధ్య కార్మికులకు అధికారాలు ఇవ్వాలనుకుంటున్నది. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, 2024 ముసాయిదా ఈ ప్రతిపాదన చేసింది. దీనిని ఈ నెల 9న జారీ చేశారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల వ్యర్థాలను తగులబెట్టకుండా చర్యలు చేపట్టవలసిన బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించాలని ఈ ముసాయిదా చెబుతున్నది.