ఓటీటీ సినిమాలకూ సెన్సార్ తప్పనిసరి!
ఓటీటీ సినిమాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకు మాత్రమే సెన్సార్ సర్టిఫికెట్ ఉన్నది.
- చట్టంలో మార్పుల దిశగా కేంద్రం
న్యూఢిల్లీ : ఓటీటీ సినిమాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకు మాత్రమే సెన్సార్ సర్టిఫికెట్ ఉన్నది. ఇక నుంచి ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలకు కూడా సెన్సార్ తప్పనిసరి చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నది. ఇప్పటి దాకా ఓటీటీ సినిమాలు 2021 సమాచార సాంకేతిక హక్కు నిబంధనల ప్రకారం రిలీజ్ అవుతున్నాయి. దీంతో సెన్సార్ బోర్డు థియేటర్ సినిమాల్లో అభ్యంతరం చెప్పిన సీన్లు, కట్స్‌ను అలాగే ఉంచి కొన్ని సార్లు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.
సత్లుజ్ వివాదం కారణంగా..ఇటీవల దిల్జిత్ దొసాంజ్ నటించిన సత్లుజ్ సినిమా పెద్ద వివాదం అయింది. మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ కల్రా జీవిత కథ ఆధారంగా మూవీ తీశారు. సెన్సార్ బోర్డు అనేక కట్స్ చెప్పగా.. దాన్ని నేరుగా జీ5 ఓటీటీలో జూలై 3న రిలీజ్ చేశారు. కానీ కొన్ని కారణాలతో ఈ మూవీని రెండు రోజుల్లోనే డిలీట్ చేయించారు. సత్లుజ్ వివాదం నేపథ్యంలో ఓటీటీ సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలనే నిబంధనను కేంద్రం తీసుకొచ్చే యోచనలో ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

