న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఎర్ర కంది పప్పుపై 10 శాతం సుంకం విధించింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో దిగుబడి సుంకం 5 శాతం కాగా, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి సుంకం(ఏఐడీసీ) 5 శాతంగా పేర్కొంది. ఈ నిర్ణయం మార్చి 8 నుంచే అమల్లోకి వచ్చినట్టు స్పష్టం చేసింది. మరోవైపు పసుపు రంగు బఠానీలపై దిగుబడి సుంకం మినహాయింపు గడువును మే 31 వరకు పొడిగించింది. దేశీయంగా లభ్యతను పెంచేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.