Gaurav Gogoi | కేంద్ర ప్రభుత్వం నీట్ అభ్యర్థులను కించపర్చింది : గౌరవ్ గొగోయ్
Gaurav Gogoi | నీట్-యూజీ (NEET-UG) పరీక్ష పేపర్ లీక్ కాలేదని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అభ్యర్థులను అవమానించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) ఆరోపించారు.
Gaurav Gogoi : నీట్-యూజీ (NEET-UG) పరీక్ష పేపర్ లీక్ కాలేదని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అభ్యర్థులను అవమానించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) ఆరోపించారు. విద్యార్థుల ప్రయోజనాల కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రభుత్వంతో పోరాడుతుందని ఆయన చెప్పారు. గడిచిన ఏడేళ్లుగా నీట్ పరీక్షల్లో ఎలాంటి పేపర్ లీకేజీలు జరగలేదని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం లోక్‌సభ సాక్షిగా ప్రకటించడంపై గొగోయ్ మండిపడ్డారు.
కేంద్రమంత్రి ప్రకటన దేశంలోని విద్యార్థులను కించపర్చే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. అదేవిధంగా రేపు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై కూడా గౌరవ్ గొగోయ్ స్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌తో సామాన్యులకు ఒరిగేదేమీ లేదని అన్నారు. కేంద్రం తన బడ్జెట్‌ను ఎప్పుడైనా అదానీ, అంబానీలను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తుందని విమర్శించారు. అదానీ, అంబానీల సలహాల తీసుకునే కేంద్ర సర్కారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నదని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

