బెంగాల్ శాసనసభ రద్దు.. మమత ఇకపై సీఎం కాదు.. గవర్నర్ కార్యాలయం వెల్లడి
ఆరునూరైనా తన పదవికి రాజీనామా చేసేది లేదంటూ ఎన్నికల్లో ఓటమి పాలైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భీష్మించిన క్రమంలో రాష్ట్ర శాసనసభను బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి గురువారం రద్దు చేశారు.
కోల్కతా, మే 7: ఆరునూరైనా తన పదవికి రాజీనామా చేసేది లేదంటూ ఎన్నికల్లో ఓటమి పాలైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భీష్మించిన క్రమంలో రాష్ట్ర శాసనసభను బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి గురువారం రద్దు చేశారు. దీని అర్థం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఇకపై ముఖ్యమంత్రి కాదు. ఈ ఎన్నికల్లో ఆమె ఎక్కడా విజయం సాధించ లేదు కాబట్టి కనీసం ఆమె ఎమ్మెల్యే కూడా కాదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 172లోని 2వ క్లాజ్ ప్రకారం శాసనసభ రద్దును మే 7వ తేదీ నుంచి అమలు చేసినట్టు గవర్నర్ ఒక ప్రకటనలో తెలిపారు.
‘2026, మే 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా, నేను పశ్చిమ బెంగాల్ శాసనసభను రద్దు చేస్తున్నాను’ అని ఆర్ఎస్ రవి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ల లూటీ ద్వారా బీజేపీ ఈ ఎన్నికల్లో అక్రమంగా, అనైతికంగా గెలిచిందని, తనకు న్యాయం జరిగే వరకు పదవి నుంచి దిగనంటూ మమతా బెనర్జీ భీష్మించుకుని కూర్చోవడంతో గవర్నర్కు ఈ చర్య అనివార్యమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

