all-party meet | అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం.. పలు అంశాలపై గళమెత్తనున్న ప్రతిపక్షం
all-party meet | సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ సమావేశాల గడువు, ప్రవేశపెట్టనున్న బిల్లులతో పాటు ప్రతిపక్షాలు లేవనెత్తనున్న అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. (all-party meet) పార్లమెంట్ సమావేశాల గడువు, ప్రవేశపెట్టనున్న బిల్లులతో పాటు ప్రతిపక్షాలు లేవనెత్తనున్న అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. పార్లమెంట్ హౌస్లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం తరఫు సీనియర్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. ప్రతిపక్షం తరుఫున కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేష్, గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీ, ఆర్జేడీకి చెందిన మనోజ్ ఝా, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన డెరెక్ ఓ’బ్రియన్, కళ్యాణ్ బెనర్జీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ ఈటీ మొహమ్మద్ బషీర్ తదితర నేతలు పాల్గొన్నారు.
కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1న ప్రారంభమై డిసెంబర్ 19న ముగుస్తాయి. ఈ ఏడాది 15 సమావేశాలకు షెడ్యూల్ చేశారు. సాధారణంగా జరిగే 20 సమావేశాల కంటే ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది.
మరోవైపు ఎన్నికల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (సర్), ఢిల్లీ కారు బాంబు పేలుడు, ప్రభుత్వ విదేశాంగ విధానాలు, ఇతర అంశాలపై గళమెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే సమావేశాల వ్యవధి తక్కువగా ఉండటంతో సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రభుత్వం కోరింది.
Also Read:
SIR Deadline Extended | ‘సర్’ గడువు వారం రోజులు పొడిగింపు.. ఫిబ్రవరి 14న తుది జాబితా
Watch: ఏఐ టీచర్ను రూపొందించిన కాలేజీ విద్యార్థి.. టీచింగ్ చేస్తున్న వీడియో వైరల్
Watch: చిరుత కోసం బోను ఏర్పాటు.. అందులో చిక్కుకున్న తాగుబోతు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

