Parliament | బడ్జెట్ సెషన్.. రేపు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన కేంద్రం
Parliament | 17వ లోక్సభ చివరి సమావేశాలు (Parliament) జనవరి 31వ తేదీ నుంచి జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని (All Party Meeting) ఏర్పాటు చేసింది.
Parliament | 17వ లోక్సభ చివరి సమావేశాలు (Parliament) జనవరి 31వ తేదీ నుంచి జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని (All Party Meeting) ఏర్పాటు చేసింది. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది.
ఇక లోక్సభ చివరి సమావేశాలు జనవరి 31న ప్రారంభమై.. ఫిబ్రవరి 9వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. నెల 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మధ్యంతర బడ్జెట్ను (interim budget) ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ (Pralhad Joshi) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 17వ లోక్సభ గడువు జూన్ 16న ముగియనున్నది. సార్వత్రిక ఎన్నికల ముందు పార్లమెంట్ సమావేశం కావడం ఇదే చివరిసారి.
Also Read..
Snowfall | కొత్త అందాలను సంతరించుకున్న కశ్మీర్ వ్యాలీ.. VIDEO
Skydiver | తెరుచుకోని పారాచూట్.. 29వ అంతస్తుపై నుంచి పడి స్కైడైవర్ మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

