Skydiver | తెరుచుకోని పారాచూట్.. 29వ అంతస్తుపై నుంచి పడి స్కైడైవర్ మృతి
Skydiver | సమయానికి పారాచూట్ (Parachute) తెరుచుకోకపోవడంతో బ్రిటిష్‌కు చెందిన ఓ స్కైడైవర్ (British Skydiver) ప్రాణాలు కోల్పోయాడు.
Skydiver | స్కైడైవింగ్.. జీవితంలో ఒక్కసారైనా ఈ సాహసోపేత అనుభవాన్ని పొందాలనుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. ఆకాశంలో నుంచి దూకడం చాలా మందికి థ్రిల్‌ను ఇస్తుంది. వేల అడుగుల ఎత్తు నుంచి దూకి పారాచూట్ ద్వారా ల్యాండ్ కావడం సరదాగా అనిపిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో పారాచూట్ ఫెయిల్ (Parachute Fails) అయితే అంతే సంగతులు.. పై ప్రాణాలు పైకే పోతాయి. ఓ స్కైడైవర్ విషయంలో కూడా అదే జరిగింది. సమయానికి పారాచూట్ తెరుచుకోకపోవడంతో ఓ స్కైడైవర్ (Skydiver) ప్రాణాలు కోల్పోయాడు.
బీబీసీ రిపోర్ట్స్ ప్రకారం.. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ షైర్‌కు చెందిన నాథీ ఒడిన్సస్ (Nathy Odinson) (33)కు స్కైడైవింగ్‌లో ఏళ్ల అనుభవం ఉంది. తన సాహసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే థాయ్‌లాండ్ (Thailand)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పట్టాయా (Pattaya) వెళ్లిన నాథీ.. అక్కడ స్కైడైవింగ్ చేయాలని భావించాడు. అయితే.. అందుకు ముందుస్తు అనుమతులు తీసుకోలేదు. శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో అక్కడ 29వ అంతస్తు నుంచి కిందకు దూకాడు. అతడి సాహసాన్ని కింద నుంచి స్నేహితుడు వీడియో తీస్తున్నాడు. దురదృష్టవశాత్తూ నాథీ కిందకు దూకిన సమయానికి పారాచూట్ తెరుచుకోలేదు. దీంతో అతడు వేగంగా ఓ చెట్టును తాకి కిందపడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Also Read..
Filmfare Awards | అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుక.. ఉత్తమ నటీనటులుగా అలియా-రణ్‌బీర్ జంట
Nitish Kumar | కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. నేడు నితీశ్ నేతృత్వంలో తొలి కేబినెట్ మీటింగ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

