Nitish Kumar | కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. నేడు నితీశ్ నేతృత్వంలో తొలి కేబినెట్ మీటింగ్
Nitish Kumar | ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నీతీశ్ కుమార్ తన తొలి కేబినెట్ సమావేశాన్ని ఈరోజు ఉదయం 11:30 గంటలకు నిర్వహించనున్నారు.
Nitish Kumar | లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అనేక నాటకీయ పరిణామాల మధ్య జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ( Nitish Kumar) ఆదివారం ఉదయం తన సీఎం పదవికి రాజీనామా చేస్తూ ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బంధన్కు, ప్రతిపక్ష ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పారు. అనంతరం బీజేపీతో కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో నితీశ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం నేడు తొలిసారి సమావేశం కానుంది.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నీతీశ్ కుమార్ తన తొలి కేబినెట్ సమావేశాన్ని ఈరోజు ఉదయం 11:30 గంటలకు నిర్వహించనున్నారు. పాట్నాలో జరిగే ఈ తొలి కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎంలు, కొత్తగా ఎన్నికైన మంత్రులు హాజరుకానున్నారు. అసెంబ్లీ కార్యక్రమాల నిర్వహణపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా, బీహార్‌లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య జేడీయూ అధినేత నితీశ్ కుమార్ మహాఘట్బంధన్కు గుడ్‌బై చెబుతూ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీతో కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పాట్నాలోని రాజ్‌భవన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ నితీశ్‌తో సీఎంగా ప్రమాణం చేయించారు. బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, డిప్యూటీ సీఎంలుగా.. మరో బీజేపీ నేత ప్రేమ్ చంద్, జేడీయూ సభ్యులు విజయ్ కుమార్, విజేంద్ర యాదవ్, శ్రావణ్ కుమార్‌తోపాటు జితిన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హెచ్ఏఎం పార్టీకి చెందిన సంతోష్ కుమార్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ సింగ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. అర్జేడీ ఈ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేయగా.. కాంగ్రెస్ గైర్హాజరయింది. ప్రమాణస్వీకారం అనంతరం నితీశ్ మాట్లాడుతూ.. ఇక ఎన్డీయేని వీడేది లేదన్నారు. అంతకుముందు మహాఘట్బంధన్ కూటమిలో తనకు పరిస్థితులు బాగా లేవని, తాను సంతృప్తిగా లేనని పేర్కొంటూ నితీశ్ కుమార్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. అనంతరం గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు.
Also Read..
Lover Murder | హోటల్ గదిలో.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను కాల్చి చంపిన బాయ్ ఫ్రెండ్
Filmfare Awards | అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుక.. ఉత్తమ నటీనటులుగా అలియా-రణ్‌బీర్ జంట
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని కన్నీళ్లు.. హౌస్ గేట్లు తెరిచిన నాగార్జున, రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్‌తో షాక్!
Arunachal Pradesh | అగ్నిగుండంగా అరుణాచల్ ప్రదేశ్.. హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక నిరసనల్లో హింసాకాండ!
Medigadda | నిరంతరం జలతరంగం.. మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం
Jagadish Reddy | కన్నెపల్లికి పోదామా.. పంపులు ఆన్ చేస్తే నీళ్లు ఎందుకు రావో చూస్తా.. జగదీశ్ రెడ్డి సవాల్!
Random Trees | కేటీఆర్ స్ఫూర్తితో.. ర్యాండమ్ ట్రీస్.. అమెరికాలో ప్రారంభమై, పలు దేశాలకు సేవలందిస్తున్న కంపెనీ
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

