న్యూఢిల్లీ: తెలుగు, హిందీ, ఇంగ్లిష్, సహా 9 భారతీయ భాషల్లో సపోర్ట్ చేసే ‘ఏఐ అసిస్టెంట్ జెమిని’ యాప్‌ను గూగుల్ భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీమియం వెర్షన్ ‘జెమిని అడ్వాన్స్డ్’లో అనేక కొత్త ఫీచర్లను జోడించింది. కొంత మొత్తం చెల్లించటం ద్వారా ‘జెమిని 1.5 ప్రో’లోని సరికొత్త ఫీచర్లు యూజర్లు పొందవచ్చునని తెలిపింది. గత ఏడాది చివర్లో ‘జెమిని’ పేరుతో అత్యంత అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్‌ను గూగుల్ పరిచయం చేసింది. ఇందులో క్రమేణా పలు ఫీచర్లను జోడిస్తూ వచ్చింది. మరికొద్ది వారాల్లో భారత్‌లోని ‘ఐఫోన్’ యూజర్లకు కూడా ఏఐ టూల్ అందుబాటులోకి వస్తుందని సంస్థ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సుబ్రమణ్య వెల్లడించారు. ప్రజల ఉత్పాదకత, అభ్యాసం, సృజనాత్మకత మెరుగుపర్చడానికి ‘ఏఐ అసిస్టెంట్ జెమిని’ సామర్థ్యాలు దోహదపడతాయని ఆయన చెప్పారు.