Gold seaze | విమానం టాయిలెట్స్‌లో కోట్ల విలువచేసే బంగారం.. సీజ్ చేసిన అధికారులు
Gold seaze | మాల్దీవులు నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో విమానంలో భారీగా బంగారం పట్టుబడింది. విమానం టాయిలెట్స్‌లోని వాష్ బేసిన్లో 3.2 కిలోల బంగారాన్ని గుర్తించి అధికారులు సీజ్ చేశారు.
బెంగళూరు: మాల్దీవులు నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో విమానంలో భారీగా బంగారం పట్టుబడింది. విమానం టాయిలెట్స్‌లోని వాష్ బేసిన్లో 3.2 కిలోల బంగారాన్ని గుర్తించి అధికారులు సీజ్ చేశారు. అధికారులు సీజ్ చేసిన ఆ బంగారం విలువ సుమారుగా రూ.1.8 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
మాల్దీవులు నుంచి అక్రమంగా బంగారు బిస్కెట్లు తరలిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు విమానం ఎయిర్‌పోర్టులో దిగగానే కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అది గుర్తించిన నిందితులు ఆ బంగారాన్ని టాయిలెట్స్‌లోని వాష్ బేసిన్లో పడేశారు. తనిఖీ చేస్తూ వచ్చిన అధికారులకు వాష్బేసిన్లో ఒక చిన్న సంచి కనిపించింది. దాన్ని తెరచి చూడగా అందులో 3.2 కిలోల బంగారం కనిపించింది.
అదే విమానంలో బెంగళూరు నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సిన ప్రయాణికుడే ఆ బంగారాన్ని టాయిలెట్స్‌లో దాచి ఉంటాడని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. దొరికిన బంగారు బిస్కెట్లను సీజ్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
మరణంలోనూ మహాదానం.. 8 మందికి ప్రాణం పోసిన టీచర్ నీరజారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

