సోనాలి ఫోగట్ కేసు | వాష్‌రూంలో డ్రగ్స్ స్వాధీనం : క్లబ్ ఓనర్ అరెస్ట్
టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత సొనాలి ఫోగట్ హత్య కేసులో క్లబ్ యజమాని సహా డ్రగ్స్ సరఫరాదారును గోవా పోలీసులు అరెస్ట్ చేశారు.
పనాజీ : టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత సొనాలి ఫోగట్ హత్య కేసులో క్లబ్ యజమాని సహా డ్రగ్స్ సరఫరాదారును గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. క్లబ్ వాష్‌రూంలో పోలీసులు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్లబ్లో డ్రగ్స్ లభ్యమవడంతో యజమానిని అరెస్ట్ చేశామని, క్లబ్ యజమానిని ప్రశ్నించామని పోలీసులు తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా డ్రగ్స్‌ను గుర్తిస్తామని చెప్పారు.
ఇక నటి సోనాలి ఫోగట్‌కు పార్టీలో బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారని, డ్రగ్స్ సేవించడం ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు. గోవా ఇన్స్పెక్టర్ జనరల్ ఓంవీర్ సింగ్ విష్ణోయ్ విలేకరులతో మాట్లాడుతూ పార్టీలో సొనాలి ఫోగట్‌కు ఓ అనుమానితుడు బలవంతంగా మత్తుపదార్ధం అందించాడని, ఆ కెమికల్ సేవించిన అనంతరం ఆమె తనపై పట్టు కోల్పోయిందని చెప్పారు. స్ప్రహ కోల్పోయిన అనంతరం అనుమానితుడు ఆమెను టాయిలెట్లోకి తీసుకువెళ్లాడని, ఆపై రెండు గంటల పాటు ఏం జరిగిందనేది వెల్లడి కావడం లేదని చెప్పారు.
ఆమె సహాయకులు ఇద్దరినీ గోవా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఫోరెన్సిక్ బృందం వారిద్దరినీ పలు ప్రాంతాలకు తీసుకువెళ్లిందని వారిని త్వరలోనే కోర్టు ఎదుట హాజరుపరుస్తామని విష్ణోయ్ తెలిపారు. డ్రగ్స్ ప్రభావంతో ఆమె మరణించినట్టు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. సొనాలీ ఫోగట్ సహాయకులను సుధీర్ సగ్వన్, సుఖ్విందర్ వసీగా గుర్తించారు. ఫోగట్ సోదరుడు రింకు ధాకా వీరిద్దరిపై గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

