పనాజీ: అసెంబ్లీ ఎన్నికల ముందు గోవాలో కొత్తకొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. కీలక నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారుతున్నారు. తాజాగా గోవాలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కార్లోస్ అల్మైదా ( Carlos Almeida ) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అసెంబ్లీ సెక్రెటరీ నమ్రతా ఉల్మాన్కు అందజేశారు. అదేవిధంగా బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు.
అయితే ప్రస్తుతం బీజేపీకి రాజీనామా చేసిన కార్లోస్ అల్మైదా ఏ పార్టీలో చేరనున్నారనేది ఇంకా స్పష్టంకాలేదు. కాగా, గోవాలో వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. రెండు రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం గోవాలో పర్యటించి ఎన్నికల నిర్వహణ కోసం సన్నాహక చర్యలు చేపట్టింది.