Mount Everest | న్యూఢిల్లీ : ఎవరెస్ట్ శిఖరం నెమ్మదిగా కదులుతున్నట్లు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) డాటాను బట్టి తెలుస్తున్నది. భారతదేశం, యూరేసియా మధ్య భూమి లోపలి భాగంలో ఘర్షణల వల్ల ఎవరెస్ట్ సంవత్సరానికి కొన్ని మిల్లీమీటర్ల చొప్పున ఈశాన్య దిశగా కదులుతున్నట్లు గుర్తించారు. ఈ కదలిక ఆగిపోయే సంకేతాలు కనిపించడం లేదు. దీనికి 75 కి.మీ. దూరంలోని అరుణ్ నది ఈ శిఖరాన్ని బలంగా ఎత్తుతున్నది.
ఈ నదితో హిమాలయ శిలలు కరిగిపోతున్నాయి. దీంతో ఎవరెస్ట్ శిఖరం పడవ మాదిరిగా తేలుతున్నదని అంటున్నారు. భారత్ సంవత్సరానికి 5 సెం. మీ. చొప్పున యూరేసియావైపు వెళ్తున్నది. వీటి మధ్య ఎవరెస్ట్ చిక్కుకుని, పక్కకు జరుగుతున్నది. పర్వతారోహకులు కేవలం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం లేదని, వారు భూమి టెక్టోనిక్ ఎలివేటర్పై స్వారీ చేస్తున్నారని అభివర్ణిస్తున్నారు.