న్యూఢిల్లీ: లాంగ్ రేంజ్ ైగ్లెడ్ బాంబ్ (ఎల్ఆర్‌జీబీ) ‘గౌరవ్’ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఈ నెల 8 నుంచి 10 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఎస్‌యూ-30 ఎంకేఐ విమానం నుంచి ఓ దీవిలోని భూమిని లక్ష్యంగా చేసుకుని డీఆర్డీవో దీనిని ప్రయోగించింది. 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను తెలిపింది. ఈ పరీక్షలు విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవో, వాయు సేనలను అభినందించారు. ఎల్ఆర్‌జీబీ గౌరవ్ వెయ్యి కేజీల శ్రేణిలోని గగనతలం నుంచి ప్రయోగించే ైగ్లెడ్ బాంబు. సుదూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఐఎన్ఎస్, జీపీఎస్ డేటాను ఉపయోగించుకుని ఇది లక్ష్యాన్ని ఛేదిస్తుంది. బాంబ్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇది విజయవంతమవడంతో ఆయుధ తయారీ రంగంలో ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యానికి మరింత ఊపు వచ్చింది.