కోల్కతా, జనవరి 31: అరుదైన నాడీ సంబంధిత వ్యాధి కారణంగా కోల్కతాకు చెందిన 10 ఏండ్ల బాలిక రెండున్నర ఏండ్లపాటు నోరు తెరుచుకొని ఉండిపోవాల్సి వచ్చింది. ఇలా దాదాపు 912 రోజులు ఆ బాలిక నరకయాతన ఎదుర్కొన్నది. ఆమె దవడ, ముఖ కండరాలను నియంత్రించే నరాలు దెబ్బ తినడంతో ఆ బాలిక ఈ వ్యాధితో బాధ పడుతున్నట్టు వైద్యులు గుర్తించారు.
ఇది దీని కారణంగానే ఎంతోకాలంగా తీవ్రమైన అసౌకర్యం, నొప్పి, సామాజిక వివక్షను ఆ బాలిక ఎదుర్కొన్నది. ఈ అరుదైన రుగ్మతకు కోల్కతాలోని ప్రభుత్వ డెంటల్ కాలేజ్ దవాఖాన వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. దవాఖాన వైద్య అధికారి ఒకరు ఈ విషయాన్ని తెలిపారు.