పాట్నా: కోచింగ్ సెంటర్ క్లాస్‌రూమ్‌లో ఒక బాలికపై బాలుడు గన్‌తో కాల్పులు జరిపాడు. (Girl Shot At By Boy) అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బుల్లెట్ గాయమైన బాలికను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పరారైన యువకుడి కోసం వెతుకుతున్నారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాంపూర్ కృష్ణా ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆమెతోపాటు అదే క్లాస్ స్టూడెంట్ అయిన బాలుడు స్థానిక కోచింగ్ సెంటర్లో ట్యూషన్ చదువుతున్నారు. మంగళవారం కోచింగ్ సెంటర్‌కు గన్ తీసుకొచ్చిన ఆ యువకుడు, యువతిపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, బుల్లెట్ గాయమైన బాలిక నేలపై పడిపోయింది. కోచింగ్ సెంటర్ సిబ్బంది, విద్యార్థులు వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు ఆమెను తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించారు. పరారీలో ఉన్న నిందితుడ్ని త్వరలో పట్టుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.