Rahul Get married | రాహుల్‌కు పెళ్లి చేయండి.. సోనియా గాంధీతో మహిళా రైతులు
Rahul Get married | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన (Get Rahul married) మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు పెళ్లి చేయాలని తల్లి సోనియా గాంధీతో మహిళా రైతులు అన్నారు. స్పందించిన ఆమె తగిన అమ్మాయిని చూడాలని వారికి తెలిపారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన (Rahul Get married) మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు పెళ్లి చేయాలని తల్లి సోనియా గాంధీతో మహిళా రైతులు అన్నారు. స్పందించిన ఆమె తగిన అమ్మాయిని చూడాలని వారికి తెలిపారు. అలాగే అక్కడే ఉన్న రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. తన పెళ్లి తప్పక జరుగుతుందని వారికి చెప్పారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రజలతో మమేకం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని హర్యానాకు చెందిన కొందరు మహిళా రైతులు శనివారం కలిశారు. తన నివాసంలో కలిసిన వారికి సోనియా గాంధీ విందు కూడా ఇచ్చారు.
కాగా, సోనియా గాంధీతో మాటల సందర్భంగా ఒక మహిళా రైతు రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన తెచ్చింది. రాహుల్‌కు పెళ్లి చేయాలని ఆమె అన్నది. దీనికి సోనియా గాంధీ నవ్వుతూ బదులిచ్చారు. అతడి కోసం అమ్మాయిని చూడాలని ఆ మహిళా రైతుతో అన్నారు. అలాగే అక్కడే ఉన్న రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. ‘అది (పెళ్లి) జరుగుతుంది’ అని ఆయన అన్నారు.
మరోవైపు, హర్యానాకు చెందిన మహిళా రైతులు కలిసిన విషయాన్ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కొంతమంది ప్రత్యేక అతిథులు తమను కలిశారని, గుర్తించుకోదగిన రోజని పేర్కొన్నారు. దేశీ నెయ్యి, తీపి లస్సీ, ఇంట్లో తయారు చేసిన పచ్చళ్లు వంటివి తమకు బహుమతిగా ఇచ్చినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను షేర్ చేశారు.
मां, प्रियंका और मेरे लिए एक यादगार दिन, कुछ खास मेहमानों के साथ!
सोनीपत की किसान बहनों का दिल्ली दर्शन, उनके साथ घर पर खाना, और खूब सारी मज़ेदार बातें।
साथ मिले अनमोल तोहफे – देसी घी, मीठी लस्सी, घर का अचार और ढेर सारा प्यार।
पूरा वीडियो यूट्यूब पर:https://t.co/2rATB9CQoz pic.twitter.com/8ptZuUSDBk
— Rahul Gandhi (@RahulGandhi) July 29, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

