న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో గత ఆదివారం మర్డర్(Delhi Murder)జరిగింది. 36 ఏళ్ల బాధితుడు కరణ్ దేవ్‌ను దారుణంగా హత్య చేశారు. అతని భార్య, ఆమె లవర్ కలిసి ఆ మర్డర్ ప్లాన్ చేశారు. ఈ ఘటనకు చెందిన వివరాలను పోలీసులు వెల్లడించారు. కరణ్దేవ్ను జూలై 13వ తేదీన మతా రూప్రాని మాగో ఆస్పత్రికి తీసుకెళ్లారు. తన భర్తకు కరెంట్ షాక్ తగిలినట్లు భార్య సుష్మిత డాక్టర్లకు చెప్పింది. అయితే దేవ్ చనిపోయినట్లు డాక్టర్లు ద్రుకవీరించారు. కుటుంబసభ్యులు అంగీకరించడంతో దేవ్‌కు పోస్టు మార్టమ్ నిర్వహించలేదు.
కానీ అదే సమయంలో బాధితుడు కరణ్ దేవ్ సోదరుడు కునాల్ దేవ్ పోలీసులకు సుస్మితపై ఫిర్యాదు చేశాడు. తన బిల్డింగ్‌లోనే ఉంటున్న రాహుల్ దేవ్ అనే వ్యక్తితో జరిగిన వాట్సాప్ సంభాషణ వివరాలను పోలీసులకు సమర్పించాడు. దీంతో కరణ్దేవ్కు పోస్టు మార్టమ్ నిర్వహించారు. ఆ రిపోర్టులో షాకింగ్ విషయం తెలిసింది. కరెంట్ షాక్‌తోనే కరణ్దేవ్ చనిపోయినా.. అతని కడుపులో నిద్రమాత్రలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అనుమానం బలపడింది. భార్య సుస్మితను అదుపులోకి తీసుకుని విచారించారు.
బాధితుడి భార్య, అతని సవతి సోదరుడికి .. సుష్మితతో రిలేషన్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్లాన్ ప్రకారమే వాళ్లు కరణ్దేవ్ను హత్య చేసినట్లు పేర్కొన్నారు. డిన్నర్లో కరణ్‌కు 15 స్లీపింగ్ పిల్స్ ఇచ్చినట్లు తేలింది. నిద్రమత్తులోకి వెళ్లిన తర్వాత కరణ్‌కు కరెంట్ షాక్ ఇచ్చారు. అయితే కరణ్ మర్డర్ మొత్తం ప్రమాదవశాత్తు జరిగినట్లుగా చిత్రీకరించారు. కర్వాచౌత్ పండుగకు ముందు భర్త తనను కొట్టినట్లు సుస్మిత చెప్పింది. తన భర్త ఎప్పుడూ డబ్బులు డిమాండ్ చేసేవాడని పేర్కొన్నది. దర్యాప్తు ఆధారంగా సుష్మితపై కేసు బుక్ చేశారు.