Watch: వివాహ వార్షికోత్సవం రోజే.. గ్యాంగ్స్టర్ను కాల్చి చంపిన అనుచరులు
Gangster Sharad Mohol | వివాహ వార్షికోత్సవం రోజునే గ్యాంగ్స్టర్ (Gangster Sharad Mohol ) ను ఇద్దరు అనుచరులు కాల్పి చంపారు. మిగతా వారు అడ్డుకుని అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: వివాహ వార్షికోత్సవం రోజునే గ్యాంగ్స్టర్ (Gangster Sharad Mohol ) ను ఇద్దరు అనుచరులు కాల్పి చంపారు. మిగతా వారు అడ్డుకుని అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో గ్యాంగ్స్టర్ శరద్ మోహోల్ తన అనుచరులతో కలిసి కోత్రుడ్ ప్రాంతంలోని ఇరుకైన వీధిలో నడిచి వెళ్లాడు. ఇంతలో వెనుక, పక్కన ఉన్న ఇద్దరు గ్యాంగ్ సభ్యులు తమ చేతిలోని పిస్టల్స్తో శరద్ మోహోల్పై కాల్పులు జరిపారు. దీంతో అతడు రోడ్డుపై పడిపోయాడు.
కాగా, ఇతర గ్యాంగ్ సభ్యులు వెంటనే అలెర్ట్ అయ్యారు. కాల్పులు జరిపిన వారిని ప్రతిఘటించగా వారు పారిపోయారు. రోడ్డుపై పడిన శరద్ మోహోల్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు గ్యాంగ్స్టర్ శరద్ మోహోల్ను పెళ్లి రోజునే అతడి అనుచరులు హత్య చేశారని పోలీసులు తెలిపారు. డబ్బు, భూమి లావాదేవీలకు సంబంధించిన వివాదాల వల్ల అతడ్ని కాల్చి చంపినట్లు అనుమానం వ్యక్తం చేశారు. శరద్ మోహోల్ హత్యకు గ్యాంగ్ వార్ కారణం కాదన్నారు.
ఈ హత్యకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మూడు పిస్టల్స్, మూడు మ్యాగజైన్స్, ఐదు బులెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Gangster #SharadMohol was shot dead by members of his gang in #Pune yesterday over a financial dispute.
A video has now emerged that shows a group of men firing at Sharad Mohol from close range in a narrow lane in Pune’s #Kothrud.
As Sharad Mohol falls to the ground after being… pic.twitter.com/KfthqI9Cff
— Hate Detector 🔍 (@HateDetectors) January 6, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

