న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తమ హిట్‌లిస్టులో ఉన్నాడని, అతడిని కచ్చితంగా చంపి తీరుతామని గ్యాంగ్‌స్టార్ గోల్డీ బ్రార్ హెచ్చరించాడు. ఈ మేరకు ఆయన ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సల్మాన్‌ను చంపుతాం.. కచ్చితంగా హతమారుస్తాం. భాయ్ సాబ్ (లారెన్స్ బిష్ణోయ్)కూడా అతడిని క్షమించబోనని ఇప్పటికే చెప్పారు.’ అని పేర్కొన్నాడు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను గోల్డీ బ్రార్ ముఠా కాల్చి చంపింది. ప్రసుతం జైలులో ఉన్న బిష్ణోయ్.. సల్మాన్‌ను చంపడమే తన లక్ష్యమని జైలు నుంచే హెచ్చరించాడు. కెనడాలో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న గ్యాంగ్‌స్టర్ బ్రార్ కోసం ఆ దేశ పోలీసులు గాలిస్తున్నారు.