Salim Dola | డ్రగ్స్ కేసు.. దావూద్ ఇబ్రహీం అనుచరుడిని భారత్‌కు తీసుకొచ్చిన అధికారులు..!
Salim Dola | అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌పై భారత దర్యాప్తులో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసు (Drugs case) లో ఇటీవల టర్కీలో అరెస్టైన దావూద్ ఇబ్రహీమ్ (Dawood Ibrahim) అనుచరుడు సలీమ్ డోలా (Salim Dola) ను భారత్‌కు తీసుకొచ్చారు.
Salim Dola : అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌పై భారత దర్యాప్తులో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసు (Drugs case) లో ఇటీవల టర్కీలో అరెస్టైన దావూద్ ఇబ్రహీమ్ (Dawood Ibrahim) అనుచరుడు సలీమ్ డోలా (Salim Dola) ను భారత్‌కు తీసుకొచ్చారు. భారత్‌లో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న సలీమ్ డోలా రెండు రోజుల క్రితం టర్కీ (Turkey) లోని ఇస్తాంబుల్ (Istambul) లో అరెస్టయ్యాడు. అతడిని తాజాగా భారత్‌కు అప్పగించడంతో అధికారులు ఈ తెల్లవారుజామున ఢిల్లీ (Delhi) కి తీసుకొచ్చారు.
డోలాను తరలించిన ప్రత్యేక విమానం మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ టెక్నికల్ ఎయిర్‌పోర్టులో దిగిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతడిని విచారణ నిమిత్తం సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రాథమిక విచారణ పూర్తయిన అనంతరం.. డోలాను ముంబై పోలీసులకు లేదా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. కాగా సలీమ్ డోలా అరెస్ట్.. అండర్‌వరల్డ్ డ్రగ్ మాఫియాకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. దావూద్ ఇబ్రహీంకు చెందిన డి-కంపెనీ విదేశాల్లో నిర్వహించే డ్రగ్ ఆపరేషన్లకు డోలానే ప్రధాన సూత్రధారి.
డోలా కనుసన్నల్లో ఏడాదికి రూ.5 వేల కోట్ల డ్రగ్స్ వ్యాపారం సాగుతోందనే అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం డోలా నెట్‌వర్క్‌కు చెందిన సలీమ్ సోహైల్ షేక్ అనే డీలర్ దుబాయ్‌లో అరెస్టయ్యాడు. అతడిని భారత్‌కు అప్పగించిన తర్వాత ఈ డ్రగ్ నెట్వర్క్ తీగ లాగితే గత ఏడాది జూన్‌లో సలీమ్ డోలా కుమారుడు తాహెర్ పట్టుబడ్డాడు. తాహెర్‌ను కూడా యూఏఈ నుంచి భారత్‌కు తీసుకొచ్చి విచారించారు. ఈ క్రమంలోనే సలీమ్ డోలా ఆచూకీ లభించినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

