పాట్నా: చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన గ్యాంగ్సర్ట్ గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో డాక్టర్, ఆసుపత్రి సిబ్బంది కలిసి అతడ్ని కొట్టి చంపారు. (gangster beaten to death by doctor) దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన గ్యాంగ్‌స్టర్ అనుచరులు ఆసుపత్రితోపాటు ఆ డాక్టర్‌కు చెందిన గుడిసెలకు నిప్పుపెట్టారు. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గ్యాంగ్‌స్టర్ చందన్ కుమార్ చికిత్స కోసం రూప్‌నగర్ గ్రామంలోని రియా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. తరచుగా ఆ ఆసుపత్రికి వెళ్లే అతడికి, డాక్టర్ అజిత్ పాశ్వాన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో చికిత్స చేసేందుకు ఆ డాక్టర్ నిరాకరించాడు. ఇది వారి మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో డాక్టర్ అజిత్ పాశ్వాన్, కాంపౌడర్ కలిసి గ్యాంగ్‌స్టర్ చందన్ కుమార్‌ను కొట్టి చంపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న గ్యాంగ్‌స్టర్ అనుచరులు ఆగ్రహంతో రగిలిపోయారు. డాక్టర్ అజిత్, అతడి సిబ్బంది కలిసి పదునైన ఆయుధాలతో చందన్ కుమార్‌పై దాడి చేసి హత్య చేశారని ఆరోపించారు. ఆసుపత్రితోపాటు డాక్టర్‌కు చెందిన గుడిసెలకు నిప్పుపెట్టారు.
మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గ్యాంగ్‌స్టర్ చందన్ కుమార్‌ను హత్య చేసి పారిపోయిన నిందితులైన డాక్టర్ అజిత్ పాశ్వాన్, కాంపౌడర్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.