ఆదివారం 29 మార్చి 2020
National - Feb 25, 2020 , 10:02:10

గాంధీ ఆశ్ర‌మ ఫోటో ట్వీట్ చేసిన ఇవాంకా

గాంధీ ఆశ్ర‌మ ఫోటో ట్వీట్ చేసిన ఇవాంకా

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా సోమ‌వారం అహ్మ‌దాబాద్‌లో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే.  ఇవాంకా కూడా స‌బ‌ర్మ‌తి ఆశ్రమానికి వెళ్లారు.  అయితే దానికి సంబంధించిన ఫోటోను ఇవాంకా త‌న ట్విట్ట‌ర్‌లో ఇవాళ పోస్టు చేసింది.  ఇండియాకు స్వేచ్ఛ‌ను ప్ర‌సాదించిన‌ ఐడియాల‌జీకి పుట్టినిల్లు గాంధీ ఆశ్ర‌మ‌మే అని ఇవాంకా అన్నారు.  గాంధీ చ‌ర‌ఖా వ‌ద్ద త‌న భ‌ర్త‌తో దిగిన ఫోటోను ఆమె ట్వీట్ చేశారు.  ప్రేర‌ణ‌కు, మార్గ‌ద‌ర్శ‌క‌త్వానికి స‌బ‌ర్మ‌తి  ఓ నిల‌యంగా నిలుస్తుంద‌ని ఆమె అన్నారు. 


logo