Antony Blinken | దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ హాజరయ్యారు. అమెరికా బయలుదేరే ముందు ఆయన ఢిల్లీలో వీధుల్లో ఆటోలో చక్కర్లు కొట్టారు. మలాసా టీని టేస్ట్ చేశారు. తనకు స్వాగతం పలికిన చిన్నారులతో కొద్దిసేపు సరదాగా గడిపారు. ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయాల సిబ్బందిని, వారి కుటుంబాలను కలిశారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న సిబ్బందిని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బ్లింకెన్‌తో పాటు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
Who says official motorcades have to be boring? Watch @SecBlinken cruise in style with the longest-serving locally employed staff at the U.S. Embassy in New Delhi. Our famous #AutoGang 🛺 and their signature “autocade” followed close behind. What an entrance! pic.twitter.com/KbhZPybLy8
— U.S. Embassy India (@USAndIndia) March 3, 2023
బ్లింకెన్ జీ20 సమావేశాల అనంతరం క్వాడ్ సభ్యదేశాలైన భారత్, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీరితో కలిసి చైనాను కట్టడి చేసేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలను చర్చించినట్లు సమాచారం. తన పర్యటన ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సంరక్షిచడంలో అమెరికా, భారత్ నిబద్ధతకు అద్దంపడుతోండని బ్లింకెన్ పేర్కొన్నారు. పర్యటనలో భారత్‌లోని మసాలా ఛాయ్‌ను రుచి చూడడం సహా ప్రతిభావంతులైన మహిళలతో సమావేశమయ్యాయని పేర్కొన్నారు. సమయం దొరికితే తాను ఎక్కువగా భారత్‌లోనే కాలం గడపడడానికి ఇష్టపడుతానని పేర్కొన్నారు.
A pleasure to meet with our staff from @USAndIndia, @USAndHyderabad, @USAndKolkata, @USAndChennai, @USAndMumbai, and their families. I’m deeply grateful for their hard work and commitment to strengthen our people to people ties and advance the #USIndia strategic partnership. pic.twitter.com/GXEJUJs8aR
— Secretary Antony Blinken (@SecBlinken) March 3, 2023