Kejriwal | ఎన్ని సమన్లు పంపితే అన్ని పాఠశాలలు ఓపెన్ చేస్తా : అరవింద్ కేజ్రీవాల్
Kejriwal | ఢిల్లీలోని విద్యార్థులందరికీ నాన్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. దర్యాప్తు సంస్థలు తనకు ఎన్ని సమన్లు పంపాయో.. ఢిల్లీ నగరంలో అన్ని పాఠశాలలను తెరుస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Kejriwal | న్యూఢిల్లీ : ఢిల్లీలోని విద్యార్థులందరికీ నాన్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. దర్యాప్తు సంస్థలు తనకు ఎన్ని సమన్లు పంపాయో.. ఢిల్లీ నగరంలో అన్ని పాఠశాలలను తెరుస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-3లో ప్రభుత్వ పాఠశాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా కేజ్రీవాల్ ప్రసంగించారు.
బీజేపీ ఈ దేశానికి అతిపెద్ద ఉగ్రవాదిగా మారిందన్నారు. కేంద్రం పరిధిలోని అన్ని దర్యాప్తు సంస్థలన్నింటినీ తనపైకి బీజేపీ ప్రభుత్వం ఉసిగొల్పుతుందన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలను సాకారం చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించి, పేదరికాన్ని రూపుమాపుతామన్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి చాలా అద్భుతమైన పాఠశాలలను ప్రారంభించాము. ఇటీవల అనేక కొత్త పాఠశాలలు ప్రారంభించామని గుర్తు చేశారు. వీటిలో 1.5 లక్షల మంది పిల్లలకు చదువుకునే అవకాశం కలుగుతుందన్నారు.
ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన ఉచిత విద్యను అందించడమే ఆప్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాత స్కూల్ భవనాలను కూల్చేసి, అధునాతన సదుపాయాలతో కొత్త భవనాలను నిర్మించామని తెలిపారు. ల్యాబ్లు, లైబ్రరీలు, తరగతి గదులను అద్భుతంగా నిర్మించామని కేజ్రీవాల్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

