న్యూయార్క్ : డౌన్ సిండ్రోమ్‌తో బాధపడే సోదరుడి 60వ పుట్టినరోజుకు అతడి నలుగురు సిస్టర్స్ అపురూపమైన బహుమతి (Viral video) ఇచ్చారు. సోదరుడు టెడ్ కోసం స్పెషల్‌గా సాంగ్‌ను రాసి అతడి కోసం వారు స్వయంగా ఆలపించారు. సిస్టర్స్ తన పట్ల చూపిన ప్రేమకు భావోద్వేగానికి లోనైన టెడ్ కన్నీరు కార్చారు.
మేజికల్లీ న్యూస్ ఇన్స్టాగ్రాం ఖాతా ఈ వీడియోను షేర్ చేయగా ఇది ఎందరో హృదయాలను మెలిపెడుతోంది. ఈ వీడియోను నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి లక్ష మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోలో టెడ్ ఛైర్లో కూర్చుని సిస్టర్స్ పాడుతుండగా వింటుండటం కనిపిస్తుంది. టెడ్ ఇతరుల పట్ల ఎన్నడూ ప్రేమ పూర్వకంగా మెలుగుతాడని, అతడి 60వ బర్త్‌డే కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నామని చెప్పుకొచ్చారు.
టెడ్ ప్రతి క్షణాన్ని ఎంతో ఎంజాయ్ చేశాడని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇలాంటి సిస్టర్స్ ఉండటం గాడ్ గిఫ్ట్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, హ్యాపీ బర్త్‌డే టెడ్ అని మరో యూజర్ రాసుకొచ్చారు. నీకు ఇలాంటి గొప్ప సిస్టర్స్ ఉండటం అభినందనీయమని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More