న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రోలో రికార్డు చేసిన పలు వీడియోలు (Viral video) నెట్టింట సందడి చేస్తుంటాయి. లేటెస్ట్గా ఢిల్లీ మెట్రోలో ఓ చిన్నారి మిన్నా మిన్నా సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సాంగ్‌కు పాప డ్యాన్స్ మూమెంట్స్ నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియోలో బ్లూ కలర్ డ్రస్‌లో పాప తన క్రేజీ స్టెప్స్‌తో అలరించింది.
అదే కంపార్ట్మెంట్లో కూర్చున్న ప్రయాణీకులు చిన్నారి పెర్ఫామెన్స్‌ను వీక్షించారు. పాప హుషారైన స్టెప్స్‌తో దుమ్మురేపిందని కామెంట్స్ సెక్షన్లో హార్ట్, లవ్ ఎమోజీలతో యూజర్లు ప్రశంసలు గుప్పించారు. కాగా, మిన్నా మిన్నా సాంగ్‌ను గ్యారీ సంధూ, జోష్ సిద్ధూ హృద్యంగా ఆలపించారు.
Read More