truck rams car, catches fire | కారును ఢీకొట్టి కంటైనర్ బోల్తా.. మంటల్లో ఆరుగురు సజీవదహనం
truck rams car, catches fire | ఇథనాల్ కంటైనర్ ఒక కారును వెనుక నుంచి ఢీకొట్టి బోల్తాపడింది. మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ఒక కుటుంబం, కంటైనర్‌లోని ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
ముంబై: ఇథనాల్ కంటైనర్ ఒక కారును వెనుక నుంచి ఢీకొట్టి బోల్తాపడింది. మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ఒక కుటుంబం, కంటైనర్‌లోని ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. (truck rams car, catches fire) మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ముంబైని నాగ్‌పూర్‌తో కలిపే ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే సమృద్ధి మహామార్గ్‌పై సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణే నుంచి వార్ధా వెళ్తున్న ఒక కారును ఇథనాల్ రవాణా చేస్తున్న కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టి బోల్తాపడింది.
కాగా, కంటైనర్ నుంచి ఇథనాల్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. కారులో చిక్కుకున్న నలుగురు కుటుంబ సభ్యులతో పాటు కంటైనర్ డ్రైవర్, హెల్పర్ ఈ ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. మృతులను రాజేష్ టిప్లే, ఆయన భార్య సుష్మ టిప్లే, వారి కుమార్తె జాహ్నవి, డ్రైవర్ అంకుష్ రౌత్, కంటైనర్ డ్రైవర్ సంజయ్ కుమార్, క్లీనర్ సమర్జిత్ పాల్గా గుర్తించారు.

Family Killed
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే హైవే సేఫ్టీ సిబ్బంది, వార్ధా పోలీసులు, అగ్నిమాపక దళం, మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పడంతో పాటు సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను మరో లేన్‌లోకి మళ్లించారు.
కాగా, కారులో ప్రయాణించిన నలుగురు వార్ధాలోని సలోడ్ ప్రాంతానికి చెందినవారని పోలీస్ అధికారి తెలిపారు. తమ కుమార్తెను పూణేలోని ఎంబీఏ కాలేజీలో దింపి ఇంటికి తిరిగి వెళ్తున్న ముగ్గురు కుటుంబ సభ్యులు ఈ ప్రమాదం బారిన పడినట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- burnt alive
- car
- collides
- family
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

