న్యూఢిల్లీ: వాట్సాప్‌లో కొత్తగా నాలుగు ఫీచర్లు చేరబోతున్నాయి. కొల్లేజ్, మోర్ విత్ మ్యూజిక్, స్టిక్కర్స్, యాడ్ యువర్స్ అనే కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. ఆరు ఫొటోలతో లేఅవుట్‌తో కొల్లేజ్‌ను రూపొందించవచ్చని మె టా తెలిపింది.
ఎడిటింగ్ టూల్స్‌తో స్టేటస్‌లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవచ్చు. ‘మోర్ విత్ మ్యూజిక్’ ద్వారా వాట్సాప్ యూజర్లు పాటను నేరుగా స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ‘స్టిక్కర్’ ఫీచర్ ద్వారా ఫొటోలను స్టిక్కర్లుగా మార్చుకోవచ్చు. ‘యాడ్ యువర్స్’ ఫీచర్ ద్వారా స్టేటస్ సంభాషణలో స్నేహితులను చేర్చుకోవచ్చు.