Encounter | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. బీజాపూర్ (Bijapur) జిల్లా చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల (Naxalites) మధ్య ఎదురుకాల్పులు (Encounter) చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (DRG), సీఆర్పీఎఫ్ జవాన్లు మంగళవారం సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులు సైతం ఎదురుకాల్పులకు దిగి నలుగురు మావోయిస్టులను మట్టుపెట్టారు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతోంది.
Also Read..
Heart Attack | భర్త మృతితో భార్య ఆత్మహత్య.. పెళ్లైన మూడు నెలలకే అనంతలోకాలకు
Virat Kohli | లండన్ కేఫ్‌లో కూతురితో కోహ్లీ.. పిక్స్ వైరల్
mohammed shami | షమీకి శస్త్రచికిత్స విజయవంతం.. ఫొటోలు షేర్ చేసిన స్టార్ క్రికెటర్